*"LOVE IS FOR LOSERS"*
పార్కులోని టీనేజర్ వేసుకున్న టీ షర్టు మీద ఇలా ఓ రాసి ఉంది. “LOVE IS FOR LOSERS” అటుగా వెళ్లే ఓ పెద్ద మనిషి అది చదివి ఆమెని అడిగాడు. “అది చాలా విషాదకరమన వాక్యం. ఇలాంటి నెగిటివ్ కోట్ గల టీ షర్ట్ని ఎందుకు ధరించావు?”
*ఆమె అతనికి ఇచ్చిన సమాధానం నుంచి మనమంతా నేర్చుకోగల ఓ గొప్ప పాఠం ఉంది.*
“సార్! ఇది నెగటివ్ వాక్యం కాదు. ఓ విషయాన్ని తెలియ జెప్పే వాక్యం మాత్రమే. టెన్నిస్లో జీరో స్కోర్ బదులు “LOVE అని వాడతారు. స్కోర్ LOVE అంటే స్కోర్ జీరో అని ఆ ఆటలో అర్థం. అందువల్ల LOVE స్కోర్ వచ్చేవారు టెన్నిస్ లో అపజయాన్ని పొందినవారు అవుతారు. ఇది టెన్నిస్ ఆట గాళ్లని హెచ్చరించే వాక్యం.”
ఆ పెద్దాయన వెంటనే చెప్పాడు. *“నాలోని లోపం నాకిప్పుడు తెలిసి వచ్చింది. కనపడేదంతా నిజం అని నమ్మి దాన్ని యధాతథంగా తీసుకోవడం తప్పు.*
*ముఖ్యంగా మనుషుల్లోని లోపాలని గ్రహించే విషయంలో పూర్తి సమాచారం లేకపోతే వారిని మనం తరచు తప్పుగా అర్థం చేసుకుంటాం.*
అందువల్ల ఎదుటి వారికి మన మాటల వల్ల హాని కూడా జరగవచ్చు. దాన్ని విరమించుకోవాలనే సందేశం నాకు నీ టీషర్ట్ మీది కొటేషన్ ఇచ్చింది” చెప్పాడా పెద్దాయన.
No comments:
Post a Comment