Search This Blog

Tuesday, January 24, 2017

భార్యాభర్తలు


ఇద్దరు భార్యాభర్తలు ప్రతిరోజు పోట్లాడుకుంటూనే ఉంటారు,

ఆటోడ్రైవర్ ఐన తన భర్తని పక్కనోళ్లు అది కొన్నారు,

ఎదిరింటోళ్లు ఇది కొన్నారు, వెనకింటోళ్లు ఇది కొన్నారు అని
భార్య ప్రతిరోజు ఏదో ఒక కోరిక కోరుకుంటూనే ఉంటుంది....

భార్య ఏది అడిగిన భర్త ఎన్నోసార్లు సర్ది చెప్పాడు,
"నేను ఒక సాధ సీదా ఆటోడ్రైవర్ ని
నువ్వు అడిగే అంతపెద్ద ఏ కోరికలు తీర్చలేను
మనకున్నంతలో సర్దుకుపోదాం" అని అన్నప్పుడల్లా
తనకి మాత్రమే వండుకొని భర్తని పస్తులు ఉంచేది భార్య...
.
ఇలా చాలా రోజులు గడిచాక ఒకరోజు ఇద్దరు కలిసి
తన కుటుంబంలో చుట్టాల పెళ్ళికి వెళ్లారు,

అక్కడ పెళ్ళిలో ఒక సరదాగా ఒక ఆట పెట్టారు
గెలిచినా దంపతులకి 20 వేల రూపాయలు
ఇస్తా అన్నారు,

వీళ్ళను కూడా అందులో పాల్గొనమని
చుట్టాలు బతిమాలడంతో సరే అన్నారు,
అప్పటికే భార్యకి పెళ్ళికి వచ్చేముందు
పట్టుచీర కట్టుకొని పోకపోతే పరువుపోతుందని
భర్తని తిట్లు తిట్టి చేసేదేమిలేక
ఇష్టం లేకపోయినా పెళ్లికొచ్చింది ....
.
ఆట మొదలయింది....
.
ఒక కుర్చీ వేశారు ఆ తర్వాత
ఒక దానిమీదొకటి వేస్తారు
ఆలా ప్రతి కుర్చీమీద
భార్యని ఎత్తుకొని అందులో
భర్త కూర్చోపెట్టాలి మళ్ళీ కుర్చీలోంచి
ఎత్తుకొని దింపాలి  అదే ఆట,

రెండో కుర్చీ మొదటి కుర్చీ మీద వేశారు భార్యని కూర్చోపెట్టాడు,

మూడోది వేశారు కూర్చోపెట్టాడు దింపాడు,

నాలుగు వేశారు కూర్చోపెట్టాడు దింపాడు,

ఐదవది వేశారు కూర్చోపెట్టాడు దింపాడు,

ఆరవది వేశారు కూర్చోపెట్టాడు దింపాడు,

ఏడువది వేశారు కూర్చోపెట్టాడు దింపాడు,

ఎనిమిదవది వేశారు కూర్చోపెట్టాడు దింపాడు,

తొమ్మిదవది వేశారు కూర్చోపెట్టాడు దింపాడు,

పదవది వేశారు బాగా ఎత్తుగా ఉంది ఐన సరే
కొంచెం కష్టంగా ఉన్న ఎత్తుకొని కూర్చోపెట్టాడు దింపాడు,

పదకొండు, పన్నెండు, పదమూడు
ఇలా కుర్చీలు పెరుగుతున్నాయి..

ఐన భర్త ఆపట్లేదు ఒక్కసారి భర్త వైపు భార్య చూసింది,

భర్త కళ్ళల్లో కన్నీళ్లు చూసింది,
ఎంత నొప్పిని భరిస్తున్నాడో తనకి కనిపించింది
ఆ నొప్పిని భరించేది వాళ్ళు గెలవాలని కాదు
కనీసం ఇలా ఐన భార్య అడిగిన కోరిక
తీర్చాలని అతను పడే కష్టం
తనకి ఆ భర్త కళ్ళల్లో భార్యకు తెలుస్తుంది,
తన మనసులో భర్తవైపు చూస్తూ
"భర్తను అర్ధం చేసుకునే భార్యలు చాలామంది ఉంటారు,

కానీ వాళ్ళల్లో నేను లేనని ఇప్పుడే తెలిసింది,

భార్యని అర్ధం చేసుకునేవాళ్ళు అతి కొద్ది మందే ఉంటారు,

అందులో నా భర్త ఉన్నాడని తన కళ్ళల్లోకి చూసాకే తెలిసింది"...

ఆ కళ్ళను చూసి తన కళ్ళు కూడా ఏడవడం మొదలెట్టాయి....
.
ఆట ముగిసింది.....
.
20వేల రూపాయలు వీళ్లకందిస్తూ,
ఈ ఆటలో గెలుపు ఓటములు అంటూ ఉండవు,

భార్య వుంటే ప్రతి భర్త గెలుస్తాడు,

భర్త ఉంటె ప్రతి భార్య గెలుస్తుంది,

ఇద్దరు గెలిస్తే వాళ్ళ మద్యున్న ప్రేమ కూడా గెలుస్తుంది,

అలాంటి ప్రేమను గుండెలో దాచుకొని
పైకి చూపించలేని, పైకి కనిపించకుండా దాచుకొని
ఎంతో మంది భార్యాభర్తలు తమ ప్రేమకి
అన్యాయం చేసుకుంటున్నారు, కనీసం
ఇలాంటి ఆటల వళ్ళైన  ఆ ప్రేమను
బైటికి తెప్పించే వేదిక ఐనందందుకు
చాలా సంతోషంగా ఉంది...

కానీ ఆ భార్య ఆ డబ్బులు తీసుకోలేదు,

"ఏ డబ్బుల కోసం నా భర్తని బాధపెట్టానో,
ఇప్పుడదే డబ్బు వల్ల నా భర్త విలువ తెల్సింది,
ఈరోజే తెలిసింది తనలాంటి భర్తను పొందడం
ఎన్ని జన్మలో వరమో అని"
.
ఆరోజు నుండి వాళ్ళిద్దరిమధ్య  చిన్న చిన్న గొడవలు తప్ప,
నాకిది కావాలి, నాకు అది కావాలని భార్య అడగలేదు...

అక్కడ ఒక సంసారం నిలబడింది,
ఒక కుటుంబంలో ప్రేమ నిలబడింది,
ఆలా సమాజంలో ఒక కుటుంబం వల్ల
విలువలు ఇంకా బతికేఉంటాయి అని చెప్పడానికే
ఈ చిన్న కథ...

మీరెప్పుడు కడవరకు తోడునీడగా ఉండండి,
నువ్వు నాకు గోడగా అడ్డున్నావని ఆలోచనలోకి
కొంచెం కూడా రానివ్వకండి..

👫💏👫

Friday, January 20, 2017

ఖరీదైన వైద్యుడు


😀ఖరీదైన వైద్యుడు😀

ఒకతనికి ఒంట్లో నలతగా ఉండటంతో స్నేహితుణ్ణి ఎవరైనా మంచి డాక్టర్ గురించి చెప్పమన్నాడు.

అతను ఒక డాక్టర్ పేరు చెప్పి, ” కానీ అతను చాలా ఖరీదైన వైద్యుడు. మొదటి సారి వెళ్ళే వారికి 500 రూపాయలు, తరువాత నుంచి ప్రతి సారీ 100 రూపాయలు తీసుకుంటాడు” అన్నాడు.

మనవాడు ఫీజు తగ్గుతుందని డాక్టర్ దగ్గరకు వెళ్ళగానే ” నేను ఇది వరకే వచ్చానండీ కానీ నయం కాలేదు…”

డాక్టర్: “ముందు రాసిన మందులే ఇంకొద్ది రోజులపాటు కొనసాగించండి….అలాగే నా ఫీజు వంద రూపాయలు కౌంటర్ లో కట్టి వెళ్ళండి.” 😂😂

ఒకాయన అప్పుడే పుట్టిన కొడుకును

ఒకాయన అప్పుడే పుట్టిన కొడుకును చూడటానికి హాస్పిటల్ కు వెళ్ళాడు.

ఆయన్ను చూస్తూనే డాక్టర్ “రండి సార్. మీ అబ్బాయి ఎంత ముద్దుగా ఉన్నాడో” అన్నాడు.

“ఆ ఊరుకోండి డాక్టర్ గారూ! మీరు ఏ అబ్బాయి నైనా అంతే అంటారు కదా”

“లేదండీ మీ అబ్బాయి నిజంగానే అందంగా ఉన్నాడు”

“అలాగా మరి అబ్బాయి అందంగా లేకపోతే ఏమంటారు?”

“ఏముందీ! అబ్బాయి అచ్చు మీలాగే ఉన్నాడు సర్” అంటాం అన్నాడు డాక్టర్
😀😀😀😀😀😀😀😀

ఈరోజు వంట చెయ్యలేదేం?

భర్త :
ఈరోజు వంట చెయ్యలేదేం?

భార్య:
మరే,పడ్డానండీ పట్టేసింది,

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

భర్త:
ఎక్కడ పడ్డావ్? ఏం పట్టింది?
.
.
.
భార్య:
దిండుపై పడగానే నిద్ర పట్టేసింది.

😋😂

హారర్ సినిమా

భార్య :
ఏదైనా 👻హారర్ సినిమా చూద్దామండీ !

.
.
.
.

భర్త :
సరే, లోపలికి వెళ్లి  మన పెళ్లి CD పట్టుకురా 😂😋

Thursday, January 19, 2017

నేను డబ్బుని..

🤑నేను డబ్బుని💰👈🏿
మీరు మరణించినప్పుడు⚰ నన్ను మీతో మోసుకు వెళ్ళలేరు 🤗

🤑నేను డబ్బుని 💷👈🏿
నేను దేవుణ్ణి కాను👺కానీ... ప్రజలందరు నన్ను దేవుని కంటే ఎంతో ఎక్కువగా పూజిస్తారు, కోరుకుంటారు😍

🤑నేను డబ్బుని💶👈🏿
నేను ఉప్పు లాగా అవసరమే కానీ మోతాదుకు మించితే🏥 అనర్దమే 👹

🤑నేను డబ్బుని 💵👈🏿
నేను మీతోవుంటే అందరూ మీతోనే ,నేను లేకపోతే మీకు ఎందరు వున్నా మీరు ఏకాకి కాక తప్పదు🙇🏻🕴

🤑నేను డబ్బుని💵👈🏿
సమస్త కీడులకు మూలము నేనె ,అయిననూ జనులంతా నా వెంటే 🏃🏻

🤑నేను డబ్బుని💷👈🏿
నన్నెంతగా ప్రెమిస్తే అంతగా మిమ్మల్ని అందరూ ద్వేషించేలా🗡🔪 పరిస్తితులు  మార్చేస్తాను😡

🤑నేను డబ్బుని💴👈🏿
నేను అనేకుల్ని ధనవంతులుగా చేసాను ,కాని మరణం🚑🚨 నుంచి వారిని తప్పించలేను.

🤑నేను డబ్బుని👈🏿
నాకు  స్తిరత్వం ⤴⤵↩↪🌪 లేదు😜

🤑నేను డబ్బుని💳👈🏿
నన్ను దేవుడు🕉☪✝🎆 సృష్టించలేదు🙏

ఒక్క మంచి రొమాంటిక్ ❤లవ్ సస్పెన్స్ స్టోరీ.


ఒక్క మంచి రొమాంటిక్ ❤లవ్ సస్పెన్స్ స్టోరీ.
తప్పకుండా చదవండి👍

boy : హాయ్..బంగారం.

girl : హాయ్ రా...

boy : ఈ రోజు నేను ఎక్కడికి పిలిచినా రావాలి..

girl : నువ్వు పిలిస్తే ఎక్కడికైనా వస్తాను రా...

boy : వెళ్దామా ??

girl : hmmm...సరే..

boy : సరే.. పద.. వెళ్తాము...

girl : OK.. ఎక్కడికి తీసుకు వెళ్తూనావూ ...

boy : surprise.. వచ్చి చూడు..
( ఇద్దరు ఇంట్లో కి వెళ్లారు )...

girl : మీ ఇంటికి ఎందుకు తీసుకోచావు???

boy : లోపలకి రా చెప్తాను...

girl : OK రా...

boy : డోర్ క్లోజ్ చెయ్...

girl : ఎందుకు రా..???

boy : చెప్తా రావే....

girl : క్లోజ్ చేశాను...

boy : రూమ్ లోకి రా..

girl : ఎందుకు రా??

boy : చెప్తాను రా...

girl : hmm...

boy : గది తలుపు క్లోజ్ చెయ్యి...

girl : ఎందుకు రా??

boy : చెప్తా..

girl : ok చేశాను....

boy : లైట్ ఆఫ్ చెయ్యి..

girl : ఎందుకు చెప్పు రా..

boy : చెప్తా అన్నను కదా..

girl : ఓకే.. ఆఫ్ చేశాను..

boy : బెడ్ పైకి రా..

girl : ఎందుకు ఎం చెయ్య బోతున్నవ్???

boy : చెప్తాను రా...

girl : hmm...

boy : దగ్గరికి రా ...

girl : hmm...

boy : ఇంకా దగ్గరికి...

girl : వద్దురా భయం గా ఉందిరా..

boy : అవ్వగానే లైట్ ఆన్ చేసుకుందాం భయపడకు..

girl : hmm...

boy : ఇపుడు నాదీ ఒకటి చూపిస్తాను..

girl : ఏందిరా ఎం చుపిస్తావు?????
.
.
.
.boy : ఇదిగో నా..
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

.
.
.
.
కొత్త రేడియం వాచ్ ..
చీకటిలో కూడా రేడియం లైట్ ఎలా కనిపిస్తూ౦ధో??

girl : దీనికా పిలిచింది ?? తూ...

Moral : boys always good boys ;)

Wednesday, January 18, 2017

ఒకానొక ఊర్లో భీద కూలివాడు ఉండేవాడు..

ఒకానొక ఊర్లో భీద కూలివాడు
ఉండేవాడు..
ఒకరోజు ఒక చెక్కల వ్యాపారి దగ్గరకు
వెళ్లి ఏదైనా పని చెప్పండి అని
బ్రతిమలాడేడు ...
చెక్కల వ్యాపారి సరే అని చెప్పి.
జీతం మాత్రం నువ్వు ఎంత చేస్తే అంత
అని చెప్పేడు..
.
కూలివాడు నాకు నా,పిల్లలకు రోజుకు
బ్రతకడానికి 100 రూపాయలు అవసరము
అవతాయి .కాబట్టి నాకు
100 రూపాయలు ఇస్తే చాలు అన్నాడు.
అప్పుడు కలప వ్యాపారం చేసే
యజమాని  అలా కుదరదు...
.
నీ పనికి తగ్గట్టుగా నీ జీతం
ఉంటుంది..
పని  ఎంత ఎక్కువగా
చేస్తే  అంత డబ్బు వస్తుంది..
అని బదులిచ్చాడు..
.
కూలివాడు తప్పక సరే అన్నాడు..

 .
కూలివాడు యజమాని  చెప్పిన
ఒప్పందం కి సరే అని చెప్పేడు.
అప్పుడు ఆ యజమాని  ఆ కూలివాడుకి
ఒక మంచి బలమైన  కత్తి ఒకటిచ్చి
అడవిలో పెద్ద పెద్ద చెట్ల మ్రానులను
నరికి తెమ్మన్నాడు...
.
కూలివాడు సరే అని వెళ్లి అడవిలో
చెట్లను నరకడం మొదలుపెట్టేడు..
ఎలాయితేనే  పొద్దు కునికే సరికి
15 చెట్లను నరికి వాటిని తెచ్చి
యజమానుడుకి అప్పజేప్పేడు.
యజమానుడు భళా  దాసుడా..
ఎవరైనా ఒక్కరోజులో 7 చేట్లకంటే
ఎక్కువగా నరకలేరు...
నువ్వు ఏకం గా 15 చెట్లు నరికావు...
భళా అని పొగిడి..
నువ్వు మొదటి రోజే చాల ఎక్కువ
కష్టపడ్డావ్ అని మెచ్చుకుని.
చెట్టుకు 10 రూపాయలు చప్పున
ఆ కూలివాడుకి 150రూపాయలు
ఇచ్చాడు..
.
ఆ  కూలివాడు మరుసటి రోజు
అడవికి వెళ్లి ఇంకా ఎక్కువ కష్టపడితే
ఇంకా డబ్బులువస్తాయి కదా అని
మొదటి రోజు కంటే ఎక్కువ సేపు
కష్టపడి పోద్దు కున్కేసరికి 10 చెట్లను
నరికి తెచ్చి యజమానుడుకి చెట్టుకు
10 రూపాయలు చప్పున 10 చెట్లు అప్పజెప్పి
100 రూపాయలు కూలి  తీసుకున్నాడు..
.
మూడవరోజు కూలివాడు  ఇంకా కష్టపడి
పనిచేసి పోద్దు కునికేసరికి 5 చెట్లు
నరికి  యజమానుడుకి అప్పజెప్పి
చెట్టుకు 10 రూపాయలు చప్పున
50 రూపాయలు తీసుకుని
వెళ్ళిపోయాడు...
మరుసటి రోజు ఎలా అయిన
ఎక్కువ చెట్లు నరకాలని వేకువ
జామున చీకటితో బయలుదేరివెల్లి
ఆ అడవిలో  ఎన్నడులేనంత గా
కష్టపడి వేకువజామున నుండి చీకటి
 పడేవరకు  కష్టపడి
ఒకే ఒక చెట్టు నరికి యజమానుడుకి
అప్పజేప్పేడు .
.
అప్పుడు ఆ యజమానుడు చెట్టుకు
10 రూపాయలు చప్పున పది
రూపాయలు తీసి ఆ పనివాడి చేతిలో
పెట్టేడు.
పనివాడు పది రూపాయల నోటు
 వైపు దీనముగా చూస్తూ శాయశక్తులా కష్టం
పెంచినా ఫలితం పది రూపాయలేే
అని తలంచి...
ఎంత చేస్తే అంత అన్నయజమానుడితో
ఉన్న ఒప్పందం గుర్తెరిగి
చేసేది ఏమీ లేక...
వెళ్ళిపోతూ  వెళ్లిపోతూ
.
అయ్యగారు నా కష్టం లో ఎటువంటి
లోపం లేదు.. 
చీకటి పడేవరకు చెమట ఓర్చి
శ్రమించాను కాని ఒకటి కంటే
ఎక్కువ నరకలేకపోయాను...
అని దీనముగా అన్నాడు..
.
అపుడు యజమానుడు నేను నీకు
ఇచ్చిన కత్తికి పదును పెట్టి ఎన్నాళ్ళు
అవుతుంది ??అని అడగగానే.
కూలివాడు నేను రోజు నా  పనిలో
మునిగిపోవడంవలన కత్తికి పదును
పెట్టె సమయం నాకు లేదు...
అందుకే కత్తికి ఒక్కసారికూడా
పదును పెట్టలేదు అని అన్నాడు...
అపుడు యజమానుడు 
అర్ధం లేని నీ శ్రమకు ,
ఆర్ధిక పతనానికి 
శరీర శ్రమలకి 
కారణం కత్తికి పదును లేకపోవడమే.

.
పదును పలితం...
ఎటువంటి సమస్యనైనా సులువుగా 
కోసిపారేయడమే

మార్పు  లేని జీవితం , పదును లేని
మొద్దుబారిన కత్తిలాంటిది..
ఏవేవో శ్రమలు పడతాం కాని
ఫలితం ఆవిరి.....
కష్టపడుతున్న..
కష్టపెట్టే పరిస్థితులు మాత్రం
మారనే మారవు
పదునైన ఆలోచనలతో మాత్రమె
గోప్పవిజయాలు సాధించగలము..

Tuesday, January 17, 2017

గమ్యం- బరువు

*గమ్యం- బరువు*

ఓసాధువు ఒకసారి తన శిష్యులలో ఇద్దరిని పిలిచి, 'ఈరోజు మీరిద్దరూ యాభైకోసుల దూరంవెళ్ళాలి' అన్నాడు.

ఒక శిష్యుడికి ఓసంచిలో తినుబండారాలు నింపి ఇచ్చి 'ఎవరైనా వీటి అవసరమున్నవారు దారిలో కనిపిస్తే వారికి పంచుకొంటూ వెళ్ళ'మన్నాడు.

రెండవ శిష్యుడికి ఖాళీసంచి ఇచ్చి 'దారిలో విలువైనవేవైనా కనిపిస్తే  వాటిని సంచిలో వేసుకొంటూ వెళ్ళ'మన్నాడు.

ఇద్దరూ ఇచ్చిన సంచులను భుజాలకి తగిలించుకొని, ప్రయాణం మొదలుపెట్టారు, నెమ్మదిగా నడచుకొంటూ.

ఖాళీసంచివాడు ఆడుతూ పాడుతూ నడుస్తున్నాడు. కొంతదూరం వెళ్ళాక అతనికి ఒక బంగారురాయి దొరికింది. దాన్నితీసి సంచిలో వేసుకున్నాడు. మరికొంత దూరంవెళ్ళాక మరొకటి కనిపించింది. దాన్నీ తీసి సంచిలో వేసుకున్నాడు.

అలా ఎక్కడెక్కడ బంగారురాయి కనిపిస్తే, దాన్ని తీసుకొని సంచిలో వేసుకొంటూ నడక సాగించాడు.

దాంతో సంచి బరువెక్కసాగింది. నడక భారంగా మారింది. శ్వాస తీసుకోవడంకూడ ఇబ్బందిగా మారింది. అడుగు తీసి అడుగేయడం చాలా కష్టమైపోయింది.

ఇక రెండో శిష్యుడు వెళ్తూవెళ్తూ ఉంటే, దారిలో ఆకలితో కనిపించినవారికి తన సంచిలోని తినుబండారాలను కొంచెంకొంచెంగా పంచుకొంటూ వెళ్ళాడు. క్రమక్రమంగా సంచి బరువు తగ్గసాగింది.
అతని నడక సులభం అయింది.

*ఎవరు పంచుకొంటూ వెళ్ళారో*, అతను తన గమ్యాన్ని చేరుకోవడం సులభమైంది.

*ఎవరు పోగేసుకొంటూ వెళ్ళారో*, అతను తన గమ్యాన్ని చేరుకోలేక పోయాడు.ఎన్నో కష్టాలు అనుభవించాడు.

_మరి మీరూ మనసు పెట్టి ఆలోచించండి... *ఏమి పంచారో, ఏమి పోగేసుకున్నారో* గమ్యాన్ని ఎలా చేరుకో దలచుకొన్నారో._

Monday, January 16, 2017

వేదగణితం - ఒక కథ


*వేదగణితం - ఒక కథ*

చదరంగం ప్రియుడయిన ఒక రాజు వద్దకు ఒక వేద పండితుడు వచ్చాడు.ఆ పండితుడు అతన్ని ఒక ఘన పనస చదివి ఆశీర్వదించాడు.

అప్పుడు ఆ రాజుగారు *ఏమయ్యా! పండితా! ఈ వేదపనసలు ఎవరైనా* *నేర్చుకుని చదవ వచ్చు! చదరంగం ఆడడానికి సహజమైన తెలివి కావాలి. నాతో కేవలం ఒక 20 ఎత్తులు పూర్తయ్యే వరకు ఆడి నిలువు! అప్పుడు నువ్వడిగిన కోరికను నెరవేర్చుతాను.*అన్నాడు.

అప్పుడు ఆ పండితుడు *రాజా! నాకు చదరంగం వస్తుందని కాదు గానీ, మిమ్ములను సంతోష పరచడానికి ఆడతాను* అంటూ రాజుతో చదరంగం ఆడి 20 ఎత్తులు పూర్తయ్యే వరకు నిలిచాడు.

రాజు గారూ ఆటను చివరి వరకూ కొనసాగిద్దాం! అన్నాడు. కానీ ఆ పండితుడు *రాజా! ఆట ను ఇక్కడితో ఆపడం నాకు క్షేమమూ - గౌరవం కూడా! రాజు గారితో 20 ఎత్తుల వరకు ఆడగలి గాను అని గొప్పగా చెప్పుకోవచ్చు!* అంటూ సున్నితంగాతిరస్కరించాడు.

*సరే! పండితా! నీ తెలివి ని గుర్తించాను. మాట ఇచ్చినట్లుగా నీ కోరిక నేరవేర్చుతాను.చెప్పు!* అన్నాడు రాజుగారు.

*మహారాజా! చదరంగం లో 64 గడులు ఉంటాయి కదా! ఒక గడిలో ఒక* *గింజ - రెండవ గడికి అంతకు రెట్టింపు రెండు* *గింజలు - మూడవ గడికి మళ్లి రెట్టింపు 4 గింజలు -* *నాలుగవ గడికి మళ్లి* *రెట్టింపు 8 గింజలు -*
*.... ఇలా 64 గడులకు లెక్క వేసి ఆ ధాన్యాన్ని పంపండి చాలు! అదే మహాప్రసాదం.* అంటూ ఆ పండితుడు వెళ్లిపోయాడు.

రాజు సరే! అని ఆ పని మంత్రికిపురమాయించాడు.

ఆ పండితుని వెంటమంత్రి గారు కూడా వెళ్లి తన ఆస్థాన గణికులతో ఎంత ధాన్యం అవుతుందో విచారించాడు.

తిరిగి వచ్చిన మంత్రితో రాజుగారు *పండితుడడి గాడు కదా.. మొదటి* *గడిలో ఒక ధాన్యపు గింజ.. రెండవ గడిలో దానికి రెట్టింపు రెండు..* *మూడవగడిలో దానికి రెట్టింపు నాలుగు, తర్వాత 8 గింజలు, ఐదవ గడిలో 16 గింజలు.. అయితే ఏముంది.. చదరంగంలో ఉన్నదంతా 64 గళ్లేగా.. ఇచ్చుకోవలసిందేమో గడికీ గడికీ రెట్టింపు..* *వెఱ్ఱి పండితుడు.. గింజ లకు గింజలు రెట్టింపు చేసుకుపోయినా ఎన్ని వస్తాయి..? ఏదేనా మంచి అగ్రహారం కోరుకుని ఉండాల్సింది..*

*అలా తీసెయ్యకండి మహారాజా!.. ఆ పండితు డేమీ వెర్రిబాగులవాడు కాదు..*

*ఎందుచేత..?* అన్నాడు రాజుగారు.

*లెక్క కట్టి చూసుకుంటే.. ఆ పండితుడడిగిన ధాన్యపు గింజలు ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేరు కనుక..!!!*

*ఎందుకు..?* ఆశ్చర్య పోతూ అడిగాడు మహారాజు

ఎన్ని ధాన్యపు గింజలో మన గణికులు గంటల కొద్ది లెక్కించి చెప్పిన సంఖ్యను ఆ పండితుడు వేదగణితం ద్వారా క్షణం లో చెప్పేసాడు మహారాజా! అంతే కాదు దాన్ని సులువుగా గుర్తుంచుకునే విధంగా ఆశువుగా ఒక చంపక మాల పద్యం కూడా చెప్పాడు.

*అలాగా.. ఏమిటా పద్యం..?*

*ఇదుగో.. వినండి మహారాజా !*

శర శశి షట్క చంద్ర శర
సాయక రంధ్ర వియత్ నగాగ్ని భూ ధర గగనాబ్ధి వేద గిరి
తర్క పయోనిధి పద్మజాస్య కుంజర తుహినాంశు సంఖ్యకు
నిజంబగు తచ్చతురంగ గేహ విస్తర మగు రెట్టికగు
సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్

పద్యం విన్న మహారాజు *దీన్లో తేలిన లెక్కెక్క డుంది..?అంతా బాణా లూ, చంద్రులూ, ఆకాశం, అంబుధి,కొండలుతప్ప..*

*అదే మహారాజా! మన దేశ పండితుల మేధ.. సంక్షిప్తంగా అల్పాక్షరము లతో అనల్పార్థ సాధకం గా ప్రజ్వరిల్లిన మేధాశక్తి అది..*

‘సరే… సరే.. విప్పి చెప్పు..’

*ఈ పద్యంలో లెక్క చిక్కు విడిపోవాలంటే మన పూర్వుల సంఖ్యా గణన పద్ధతి తెలియాలి.. వారు ఒక్కొక్క అంకెకు విశ్వంలో విరాజిల్లే ప్రకృతి శక్తులను సంకేతా లుగా ఏర్పాటు చేసుకున్నారు.

ఈ పద్యంలో

*శర, సాయక,* -  అనే పదాలకు అర్థం బాణాలు అని.( మన్మథుని పంచ సాయకములు) ఇక్కడ ఆ రెండు పదాలు 5 సంఖ్యను సూచిస్తాయి.

*గగన, వియత్ - 0*
(ఆకాశం గగనం శూన్యం)

*శశి, చంద్ర, తుహినాంశు -1*(చంద్రుడొకడే భూమి కి )
*షట్కము - 6*
*రంధ్ర - 9*
(నవరంధ్రాలు)
*నగ, గిరి, భూధర - 7*
*అగ్ని - 3*
(మూడగ్నులు; గార్హపత్యాగ్ని,దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని)
*అబ్ధి, పయోనిధి - 4*
*వేద -4*
(చతుర్వేదములు)
*తర్క - 6*
(షట్ తర్కప్రమాణాలు, ‘ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన,శబ్ద, అర్థాపత్తి, అనుపలబ్ధి’)
*పద్మజాస్య - 4*
(పద్మజుడు బ్రహ్మ, చతుర్ముఖుడు)
*కుంజర - 8*
(అష్ట దిగ్గజములు)

ఇవీ ఇందులోని అంకెల సంకేతాలు.. ఇప్పుడు ఇవి ఆయా పదాల దగ్గర పెట్టుకుని చూస్తే..’
శర శశి షట్క చంద్ర శర
5     1     6         1    5
సాయక రంధ్ర వియత్
5            9       0
నగాగ్ని భూ
    7       3
ధర గగనాబ్ధి వేద గిరి
  7     0  4      4    7
తర్క పయోనిధి
6         4
పద్మజాస్య కుం
    4     
జర తుహినాంశు
8         1
సంఖ్యకు నిజంబగు తచ్చతురంగ గేహ వి
స్తర మగు రెట్టికగు   సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్

*అంకెలులెక్కించెటప్పుడు మనపూర్వీకుల సాంప్రదాయ సూత్రం .. "అంకానాం వామతో గతిః"* - కుడి నుంచి ఎడమకు చేర్చి చదువు కోవాలి..

అలా చేస్తే చివరగా తేలిన సంఖ్య.
*1,84,46,74,40,73,70,95,51,615*

*ఒకకోటి 84లక్షల 46 వేల 74కోట్ల 40 లక్షల73 వేల 70కోట్ల 95 లక్షల 51వేల 615*

ఇంత పెద్ద సంఖ్యను పిలవడమే కష్టం.ఇక ఇంతోటి ధాన్యాన్ని నిలవచేయాలి అంటే,
*ఒక ఘనమీటరు విస్తృతి గల గాదెలో దాదాపు* *ఒకటిన్నర కోటి గింజ లు దాచవచ్చు అని అంచనా వేసుకుంటే,*
*4మీటర్ల ఎత్తు 10 మీటర్ల నిడివిగల గాదెలు* *దాదాపుగా 12,000 ఘనకిలోమీటర్లు విస్తీర్ణం కావాలి..*

*పేర్చుకుంటూ వెళితే  300,000,000-ముప్పై కోట్ల కిలోమీటర్లు..* అంటే *భూమికి సూర్యునికి ఉన్నదూరానికి రెట్టింపు.*

పోనీ *లెక్కపెట్టడానికి ఎంత సమయం* *పడుతుందో అంటే*
*సెకనుకు ఒక్కగింజగా లెక్కించితే అన్నీ లెక్కించటానికయ్యేవి  58,495 కోట్ల సం.।।లు...*

అదీ సంగతి…

వేదపండితులతో వేళా కోళం తగదు మహారాజా!… *నిజానికి అతడు చదివిన ఘనపనస* *కూడా లెక్కలకు,ధారణ శక్తికి సంబంధించినదే!* *ఎంతో ధారణ శక్తి - పాండిత్యం - సాధన ఉంటేకానీ ఘణాపాటి కాలేరు.* అతడు ప్రేమగా ఆశీర్వదించడానికి వస్తే అతని వేదవిద్యను కించ పరిచారు. ఇప్పుడు ఏం చేయడం? మాట తప్పిన దోషం సంక్రమిస్తుంది.

అది విన్న మహారాజు సిగ్గుపడ్డాడు. అతని పూర్వీకుల నుండి ఎవ్వరు కూడా ఇప్పటి వరకు మాట తప్పలేదు.

ఏం చేసి ఈ దోషం నుండి తప్పించుకోవలో ఆ పండితున్నేఅడుగుదాము.అని ఆ పండితున్ని పిలిపించిక్షమించమంటూ వాగ్దాన భంగ దోషం అంటకుండా ఏంచేయాలో చెప్పుమన్నాడు.

ఆ పండితుడు *రాజా! ఈ లోకంలో ఆవుకు విలువ కట్టలేము.ధాన్యంబదులు గా అవును ఇవ్వండి చాలు!* అని ఆ రాజును వాగ్దాన భంగ దోషం నుండి తప్పించాడు.

Thursday, January 12, 2017

ఓ తండ్రి తన ముగ్గురి పిల్లలనీ దగ్గరకి పిలిచాడు..


ఓ తండ్రి తన ముగ్గురి పిల్లలనీ దగ్గరకి పిలిచాడు..

‘చూడండి పిల్లలూ! మీ ముగ్గురూ ఈ మధ్య తెగ అల్లరి చేస్తున్నారు. ఒక వారం పాటు ఎవరైతే మీ అమ్మమాటను చక్కగా వింటారో, పేచీ పెట్టకుండా తింటారో, బుద్ధిగా పనిచేసుకుంటారో... వారు ఈ కారు బొమ్మన ఉంచుకోండిి ’ అన్నాడు.

‘ఓ దానికేం భాగ్యం!’ అన్నారు పిల్లలు.

వారం రోజులు తరువాత.
ముగ్గురూ కలిసి ఆ కారు బొమ్మను తండ్రి చేతిలో పెట్టారు.

‘అదేంటీ కారు బొమ్మ నచ్చలేదా!’ అన్నాడు తండ్రి ఆశ్చర్యంగా.

‘బొమ్మ నచ్చక కాదు. నువ్వు చెప్పిన షరతుల ప్రకారం ఆలోచిస్తే... చక్కగా అమ్మమాటని విన్నదీ, పేచీ పట్టకుండా తిన్నదీ, బుద్ధిగా పనిచేసుకున్నదీ... నువ్వేనని తేలింది. అందుకని ఈ బొమ్మ నీకే దక్కుతుంది’ అనేసి తుర్రుమన్నారు పిల్లలు.

ప్రేమా,గెలుపూ,ఐశ్వర్యం

ఒక పల్లెలోని ఒక ఇంటికి చాలా రోజులు ప్రయాణం చేసి, అలసిపోయిన ముగ్గురు పెద్దవాళ్ళు వచ్చారు.

"లోపలికి రండి నా భర్త వచ్చిన వెంటనే భోజనం చేయవచ్చు మీరు" అంటూ పిలిచింది.

మగవాళ్ళు లేని ఇంట్లో మేం భోజనం చేయము.అతను తిరిగివచ్చిన తరువాతే లోపలికి వస్తాము అని బయట అరుగు మీద అలసట తీర్చుకుంటున్నారు.

భర్త పొలం పని ముగించుకొని సాయంత్రం ఇంటికి వస్తూనే బయట అరుగు మీద ఉన్న వారి వద్దకు వెళ్ళి"నా భర్త వచ్చాడు లోపలికి రావడానికి మీకు అభ్యంతరం లేదు కదా," అని అడిగింది." లేదు..... కాని మా ముగ్గురిలో ఒకడు మత్రమే మీ ఇంట్లోకి వస్తాడు అది మా నియమం" అన్నారు.

ఆ ఇల్లాలు ఆశ్చర్యంతో చూస్తుండగా పెద్దాయన" నా పేరు 'ప్రేమా, ఇతని పేరు 'గెలుపూ, ఈయన పేరు 'ఐశ్వర్యం'. మాలో ఒక్కరిని మాత్రమే ఆహ్వానించు అన్నాడు. వచ్చిన వారు మాములు మనుషులు కారు అని ప్రేమ, గెలుపు, ఐశ్వర్యం అనే రూపాల్లో ఉన్న ఆశీర్వాదాలు అని తెలిసిపోయింది.

సంతోషంతో పొంగిపోతు అమె ఆ విషయాన్ని భర్తకు చెప్పింది. విన్న భర్త పరవశంతో "బ్రతుకులో గెలుపే ముఖ్యము కాబట్టి ఆయన్నే పిలుద్దాం అని" అన్నాడు.

దానికి ఆమె "గెలుపు ఒకటే ఏమి లాభం, ఐశ్వర్యం లేకపోయే కాబట్టి ఐశ్వర్య  ఆహ్వనిద్దాం" అని అంది.

వీరి ఇద్దరి మాటలు వింటున్న్న వారి కోడలు, గెలుపు ఐశ్వర్యం కంటే ప్రేమ అనేది భార్యా భర్తలు, పిల్లలు, అత్తా కోడళ్ళు కలిసి మెలసి ఉండగలం కాబట్టి ప్రేమ మూలాధారం సుఖజీవనానికి" అంటూ సలహ ఇచ్చింది.

వెంటనే ఆ ఇంటి యజమాని బయటకు వచ్చి మీలో ' ప్రేమ ' అనే వ్యక్తి లోపలికి రావచ్చు అన్నాడు. ప్రేమ అనే వ్యక్తి ఇంట్లోకి వచ్చాడు. ప్రేమ వెనకే గెలుపు, ఐశ్వర్యం కూడా అతనితో బాటు ఇంట్లోకి వచ్చాయి. ఇది చూసి ఆమెకు ఆశ్చర్యం కలిగింది.

ఆ ముగ్గురూ "మీరు గెలుపు లేదా ఐశ్వర్యం కోరి ఉంటే మేమిద్దరం ఉండి పోవాల్సివచ్చేది .ప్రేమను మీరు పిలవడం వలన మేమూ పిలవకుండానే వచ్చాము కారణం ప్రేమ వెన్నంటే గెలుపు, ఐశ్వర్యం అనేవి నడవాలి అని మా దేవుని ఆఙ్ఞ" అన్నారు......కాబట్టి ఎక్కడ ప్రేమ ఉంటె అక్కడ ఐశ్వర్యం, గెలుపు తప్పక ఉంటాయి.

Life is Beautiful.. Celebrate Every Moment with Love and Compassion