Search This Blog

Thursday, January 5, 2017

మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు..

మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు..
కానీ కొన్ని రోజులకి అనుమానం వచ్చి డాక్టర్ ని కలిశాను.

డాక్టర్ గారు చాలా పరీక్షలు చేసి రిపోర్ట్స్ పరిశీలనగా చూస్తూ వచ్చి కూర్చున్నారు.
ఆయన ముఖం లో ఉన్న విచారం నాకు స్పష్టంగా కనిపిస్తుంది.
'ఏమైంది డాక్టర్ గారు..? ఎనీ ప్రాబ్లం..?'
అని అడిగా..
ఎలా చెప్పాలో తెలియడం లేదు...అంటూ సంశయిస్తున్నారు.
'పర్వాలేదు చెప్పండి.' అన్నాను.

నా అనుమానమే నిజమయ్యింది..
డాక్టర్ గారు చెప్పిన విషయం విని ఒక్క క్షణం ప్రపంచం స్తంభించిపోయినట్టుగా అనిపించింది..
ఇంకా ఎంత సమయం ఉంది డాక్టర్..? అని అడిగితే..
మ్యాక్స్.. రెండు సంవత్సరాలు అని చెప్పారు..

ఎందుకు డాక్టర్ నాకే ఇలా ఎందుకు జరుగుతుంది.?
నేను చేసిన తప్పేంటి..? అని నేను విచారిస్తుంటే..
'భాద పడకండి దీనిపై అమెరికా లో పరిశోధనలు జరుగుతున్నాయి. త్వరలోనే పరిష్కారం దొరకొచ్చు.' అని డాక్టర్ గారు ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు.
.
.
.
.
.
.
.

.
.
.
హే
.
.
.
ష్
.
.
.
.
.
.
.
.
.
.
.
ఏంటి అలా చూస్తున్నారు..?

భాగ్యనగరం లో దిక్కుమాలిన పొల్యూషన్ వల్ల జుట్టు రాలిపోతుందయా.

ఇంతవరకు ఒక్కసారి కూడా పెళ్ళి కాలేదు.😜
మహేష్....

No comments:

Post a Comment