Search This Blog

Sunday, February 5, 2017

సైకాలజీకి సంబంధించిన క్లాస్ జరుగుతుంది.

*సైకాలజీకి సంబంధించిన క్లాస్ జరుగుతుంది.*

ఆ క్లాస్ టీచర్ పాఠంలో భాగంగా.. మంచినీళ్లు నింపిన ఒక గ్లాసును చూపించి.. దీని బరువు చెప్పగలరా? అని అడిగాడు.

చాలామంది దాదాపు 150 గ్రాములు అని చెప్తారు.

దానికి టీచర్ వివరణ ఇస్తూ..
దీని వాస్తవ బరువు కొద్దిగానే కావచ్చు. కానీ నేను దీన్ని కేవలం ఒక నిమిషం మోస్తే బరువు తెలియదు. పది నిమిషాలు మోస్తే కొద్దిగా బరువు అనిపిస్తుంది. అదే ఒక గంట మోస్తే నా భుజం నొప్పి పుట్టేంతగా నొప్పి లేస్తుంది. అదే ఒకరోజంతా మోస్తే నా చెయ్యి పని చేయలేనంతగా నొప్పి పుడుతుంది.

మన *కష్టాలు* కూడా అంతే.. కొద్దిసేపు మాత్రమే తలుచుకుంటే బాధ తక్కువ ఉంటుంది. కొన్ని గంటల పాటు తలచుకుంటే కొంత ఎక్కువ బాధ ఉంటుంది. అదే రోజంతా తలచుకుంటే ఏ పనీ చేయలేము.

అందుకే చిన్న కలతను వదిలించుకోలేకపోతే.. అది చింతగా మారుతుంది. మనోవ్యధకు దారితీస్తుంది.

_*"బాధలైనా.. కష్టాలైనా.. కన్నీైళ్లెనా*_ మనం ఫీల్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. అందుకే వాటిని మనం ఎంత తీసుకుంటున్నామన్నది ముఖ్యం. ఎంత తొందరగా గ్లాసు కిందకు దించి బరువు తగ్గించుకోవాలని చూస్తామో.. *కష్టాలు* కూడా అంతే!

*నీతి*: ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది.

Wednesday, February 1, 2017

మన రాజకీయ నాయకుడొకాయన

మన రాజకీయ నాయకుడొకాయన ఓ సారి అమెరికా ప్రభుత్వం ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఓ రాజకీయ నాయకుడు అతన్ని తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు. మన నాయకుడు ఆయనకున్న విశాలమైన భవనాలు, ఇంటి ముందు కావాల్సినంత ఖాళీ స్థలం, ఖరీదైనా ఫర్నీచర్ అన్నీ చూసి ముచ్చట పడి…

“మీ కొచ్చే కొద్దిపాటి జీతాలతో ఇంత ఇంటిని, వస్తువులను ఎలా సంపాదించగలిగారు” అని అడిగాడు.

దానికి ఆ సెనేటర్ నెమ్మదిగా నవ్వి అతన్ని కిటికీ దగ్గరికి తీసుకెళ్ళాడు.

“అదిగో ఆ నది కనిపిస్తోందా?”

“కనిపిస్తోంది”

“దాని మీద వంతెన కనిపిస్తోందా?”

“కనిపిస్తోంది”

“10%” అన్నాడు.

మన నాయకుడు అర్థమైందన్నట్లుగా నెమ్మదిగా తల పంకించాడు.

తర్వాత కొద్ది రోజులకు సదరు అమెరికన్ సెనేటర్ భారత్ కు వేంచేశాడు. అతన్ని మన నాయకుడు తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు.

సెనేటర్ కి మన నాయకుడు ఇల్లు చూడగానే మతిపోయినంత పనైంది. రాజభవనాన్ని తలదన్నే ఇల్లు, ఇంటి నిండా ఖరీదైన సామాగ్రి, నౌకర్లు, కార్లు…

ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయాడు.

“మీకొచ్చే రూపాయల్లో జీతంతో ఇదెలా సాధ్యం?” అని ప్రశ్నించాడా సెనేటర్.

మన నాయకుడు అతన్ని కిటికీ దగ్గరకు తీసుకెళ్ళి

“అక్కడ నది కనిపిస్తోందా?”

“కనిపిస్తోంది”

“దాని మీద వంతెన కనిపిస్తోందా?”

“అదేంటి అక్కెడ వంతెనే లేదు కదా!!!”

“100%” అన్నాడు నెమ్మదిగా…

ఇప్పుడు దిమ్మతిరగడం సెనేటర్ వంతైంది….