అయోమయం" గాడు డిల్లీ వెళ్లి , కుతుబ్ మినార్ చూడటానికి వెళ్ళాలను కున్నాడు !!
కానీ దారి తెలియక, ఒక పోలీస్ వాడీ వద్దకు వెళ్లి ..."అయ్యా!!కుతుబ్మినార్ కి వెళ్లాలి, కొంచం ఎలా వెళ్ళాలో చెబుతారా??" అని అడిగాడు .
"నువ్వు ఒక పని చెయ్యి ..ఇక్కడె నించో 46 వ నంబర్ బస్ వస్తుంది, అది నిన్ను డైరెక్ట్ గా కుతుబ్ మినార్ తీసుకుని వెళుతుంది!!" అన్నాడు పోలీసు.
"చాలా థెంక్స్ అండీ!" అన్నాడు "అయోమయం"
................................
...................................
ఒక మూడు గంటల తరువాత !!
పోలీసు ఆయన తన బండి మీద , పనులన్నీ చూసుకుని తిరిగి వస్తున్నాడు !!
ఆశ్చర్యం!! "అయోమయం" గాడు ఇంకా అక్కడె నించుని వున్నాడు!!
"ఏమిటీ ఇంకా వెళ్ల లేదా...చెప్పానుగా 46 వ నంబర్ బస్ ఎక్కమనీ??!" అన్నాడు..
"అదే సార్ నేను చూస్తూనె వున్నాను లెండి .....ఇప్పటికి 39 బస్సు లే వెళ్ళాయి ....46 వ డి రాగానే ఎక్కేస్తాను!!" అన్నాడు "అయోమయం"గాడు.
😂
No comments:
Post a Comment