ఓ తండ్రి తన ముగ్గురి పిల్లలనీ దగ్గరకి పిలిచాడు..
‘చూడండి పిల్లలూ! మీ ముగ్గురూ ఈ మధ్య తెగ అల్లరి చేస్తున్నారు. ఒక వారం పాటు ఎవరైతే మీ అమ్మమాటను చక్కగా వింటారో, పేచీ పెట్టకుండా తింటారో, బుద్ధిగా పనిచేసుకుంటారో... వారు ఈ కారు బొమ్మన ఉంచుకోండిి ’ అన్నాడు.
‘ఓ దానికేం భాగ్యం!’ అన్నారు పిల్లలు.
వారం రోజులు తరువాత.
ముగ్గురూ కలిసి ఆ కారు బొమ్మను తండ్రి చేతిలో పెట్టారు.
‘అదేంటీ కారు బొమ్మ నచ్చలేదా!’ అన్నాడు తండ్రి ఆశ్చర్యంగా.
‘బొమ్మ నచ్చక కాదు. నువ్వు చెప్పిన షరతుల ప్రకారం ఆలోచిస్తే... చక్కగా అమ్మమాటని విన్నదీ, పేచీ పట్టకుండా తిన్నదీ, బుద్ధిగా పనిచేసుకున్నదీ... నువ్వేనని తేలింది. అందుకని ఈ బొమ్మ నీకే దక్కుతుంది’ అనేసి తుర్రుమన్నారు పిల్లలు.
No comments:
Post a Comment