*ఆశ~పని*
*మా సుబ్బారావు*
*చాలా మంచోడు*
*ఆశైతే వుంది*
*కానీ సరైన పనే లేదు*
*పనిచేసే ఆలోచనా లేదు*
*పాపం*
*భగవంతుడికే జాలేసింది*
*వచ్చి ప్రత్యక్షమయ్యాడు*
*ఏం కావాలో కోరుకొమ్మన్నాడు*
*సుబ్బారావుకు సంతోషమనిపించింది*
*స్వామీ !*
*నెను చల్లగా ఉండాలి*
*పైకి ఎదగాలి*
*నాతో పాటు నలుగురిని పైకి తీసుకెళ్ళగలగాలి*
*మరో చిన్న కోరిక*
*నాకు పెద్దగా శ్రమ ఉండకూడదు అన్నాడు*
*తధాస్తు అన్నాడు దేముడు*
*మరుసటి రోజు*
*సుబ్బారావును లిఫ్టు బోయ్ గా మార్చారు*
🙁
*మళ్ళీ భగవంతుని ప్రార్ధించాడు సుబ్బారావు*
✋
*మరలా ప్రత్యక్షమయిన భగవంతుడు*
*ఏమి భక్తా !*
*ఏమయింది అన్నాడు*
🙁
*స్వామి ఎదగటమంటే*
*లిఫ్టులో పైకి నలుగురుని తీసుకెళ్ళటం కాదుగా*
*కంటి ముందు డబ్బులుండాలి అన్నాడు*
*తధాస్తు అంటూ మళ్ళి మాయమయ్యాడు స్వామి*
*మరుసటి రోజు*
*సుబ్బారావుకు ATM వద్ద వాచ్ మెన్ గా కూర్చోబెట్టారు*
*కంటిముందు ఇరవైనాలుగు గంటలూ డబ్బులుంటాయి*
*అందరూ డబ్బులు తీసుకుంటూ ఉంటారు*
*కానీ*
*మన సుబ్బారావు మాత్రం వాచ్ మానే*
*సుబ్బారావు*
*మళ్ళీ భగవంతుని ప్రార్థించాడు*
*ఏం భక్తా !*
*ఇబ్బంది పడుతున్నట్టున్నావ్ ..*
*ఏమయింది అన్నాడు*
*ఏమవటమేంటి సామీ !*
*ఏదడిగినా మరేదో ఇస్తావ్ !*
*ఎలా సామీ అన్నాడు*
*కంటి ముందు డబ్బులన్నావుగా ఇచ్చాను అన్నాడు స్వామి*
*కంటి ముందు అంటే ATMకాదు*
*నా టేబిల్ మీదకు రావాలి అన్నాడు*
*నీవు ఏ పనీ చేయవు కదా భక్తా!*
*అందుకే అటువంటి పని కల్పించాను*
*అంత చికాకు పడకుండా ఆఖరు సారిగా అడుగు అన్నాడు స్వామి*
*నాకు పని చేయటం రాదు*
*ప్రతివాడు నా దగ్గరకే రావాలి*
*వాడి పని వాడే చేసుకుని వెళ్ళాలి*
*కానీ*
*నా టేబిల్ మీదకు డబ్బు రావాలి*
*తధాస్తు అన్నాడు*
*మరుసటీ రోజు సుబ్బారావుకు*
*సులబ్ సౌచాలయ్ దగ్గర కూర్చునే అదృష్టం దక్కీంది*
*ఎవరి పని వారే చూసుకుంటారు*
*టేబిల్ పై డబ్బులు పెట్టి వెళతారు*
*సుబ్బారావు మళ్ళి ప్రార్థించాడు*
*భగవంతుడు రాలేదు*
*ముగింపు*
*మనం అడిగేటప్పుడు*
*ఎవరినైనా సరే..*
*పూర్తిగా అర్ధమయ్యెటట్లుగా అడగాలి*
*లేదా..*
*మన పని మనం చేసుకోవాలి*
*మన శక్తీ~ఆలోచనల కన్నా మించిన విషయం ఇంకేముంటుంది*
*పనియే దైవం*
*దైవమే పని*
No comments:
Post a Comment