Search This Blog

Tuesday, December 27, 2016

*చట్టానికీ* *న్యాయానికి**ధర్మానికీ తేడాలేంటి*

ఓ మిత్రుడు ఓ ప్రశ్న వేశాడు.. *చట్టానికీ* *న్యాయానికి*
*ధర్మానికీ తేడాలేంటీ* అని..!
.
.

ఒక వ్యక్తి నువ్వు అడగ్గానే లక్ష రూపాయలు ఎలాంటి
ప్రామిసరీ నోట్లు, గ్యారంటీలు లేకుండా ఇచ్చి నిన్ను నిలబెట్టాడు.
బాగుపడ్డావు.
ఈలోపు తను దెబ్బతిని చివరకు తనే పోయాడు... ఆయన
భార్యాపిల్లలు బజార్నపడ్డారు...
*ఏ కాగితాలూ లేనందున ఆ డబ్బు తిరిగి చెల్లించాల్సిన*
*అవసరం లేదు*
... *అదీ చట్టం*
*తప్పకుండా ఆ డబ్బు వడ్డీతో సహా చెల్లించాలి*
........ *అదీ న్యాయం*
*డబ్బు, వడ్డీ ఇచ్చి ఆ కుటుంబం నిలదొక్కుకునేదాకా*
*మద్దతుగా నిలబడాలి*
....... *అదీ ధర్మం*

No comments:

Post a Comment