Search This Blog

Tuesday, December 27, 2016

ఈ 5 గురు మీకు తోడుంటే.. సక్సెస్ మీ వెంటే.

*ఈ 5 గురు మీకు తోడుంటే.. సక్సెస్ మీ వెంటే..!*
జీవితంలో విజయం సాధించాలన్నా, సంతోషంగా ఉండాలన్నా మనకి హ్యూమన్ రిలేషన్స్ చాలా ముఖ్యం. మనకి ఎన్ని వందలమంది తో పరిచయాలు ఉన్నాయి అనే దానికన్నా, మనకు పరిచయమున్న వ్యక్తులు, మన సన్నిహితులు మన జీవితంలో ఎలాంటి పాత్ర పోషిస్తారు అనేది చాలా ముఖ్యం. మనకి 5 పాత్రలు పోషించే వ్యక్తులు కావాలి. అవేమిటో ఒక ఉదాహరణతో తెలుసుకుందాం..

 
మనకి ఒక సినిమాకి వెళ్ళాలి అనిపించినప్పుడు: సినిమాకి వెళ్ళాలో వద్దో చెప్పేవారు *టీచర్*
బాగున్న రెండు మూడు సినిమా పేర్లు చెప్పి, దానిలో నీకిష్టమైనది చూడు, లేదా సినిమా కన్నా బెటర్ టైం పాస్ ఉంది అది ట్రై చెయ్ అనే వాడు *మెంటార్*
సినిమాకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు, సినిమా నుంచి నీవు ఏమి ఆశిస్తున్నావు, టైం పాస్ కోసం వెళ్తున్నావా? మూడ్ బాగాలేక వెళ్తున్నావా? అందరూ ఆ సినిమా బాగుంది అన్నారు కాబట్టి వెళ్తున్నావా.. ఇలా మనల్ని అన్ని వైపులా నుంచి విశ్లేషించి సరైన నిర్ణయం తీసుకునేలా ప్రోత్సహించేవాడు *కోచ్*
నువ్వు ఆ సినిమా చూడటం అవసరం అని నమ్మి, నీకు టికెట్స్ కొనిచ్చేవారు, నీకు వెహికిల్ ఇచ్చి సినిమాకి పంపే వాళ్ళు *స్పాన్సర్స్*
మన నుంచి ఏమీ ఆశించకుండా, జస్ట్ మనల్ని సంతోషంగా ఉంచడం కోసం, పలానా సినిమా బాగుంది చూడు, ఆ సినిమా రాడ్ రా బాబూ నువ్వు వెళ్లి బలికాకు అని చెప్పేవారు మన *వెల్ విషర్స్..*

సినిమా కి లింక్ చేసి చెబితే సింపుల్ గా ఉంది కానీ, నిజంగా మనకి *టీచర్, మెంటార్, కోచ్, స్పాన్సర్, వెల్ విషర్* ఈ 5 రకాల పాత్రలు పోషించేవాళ్ళు మనకి కావాలి.

*టీచర్స్*
మనకి స్కూల్లోకాలేజీలో చదువు చెప్పిన టీచర్లే కాదు, మన జ్ఞానం వికసించాలి అంటే మనం నిత్య విద్యార్థులుగా ఉండాలి. ఈ టీచర్ పాత్రని మీ ఫ్రెండ్స్, పేరెంట్స్, రిలేటివ్స్ ఎవరైనా పోషించవచ్చు. మనకన్నా జ్ఞానం ఎక్కువ ఉన్నవాళ్ళు ఎవరైనా మనకి టీచర్లు కావచ్చు.

*మెంటార్*
మెంటార్ అంటే మనల్ని తీర్చిదిద్దేవారు. మన మానసిక స్థితిని వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్లు మనల్ని తీర్చిదిద్దుతారు.

*కోచ్*
కోచ్ అంటే మనకి దగ్గరగా ఉండేవారు, మన గురించి కాస్త పట్టించుకునేవారు. మనకి ఏది మంచిదో ఆలోచించి సజెస్ట్ చేసేవారు.

*స్పాన్సర్*
స్పాన్సర్ అంటే చిన్నప్పుడు మన తల్లిదండ్రులు కావచ్చు, పెద్దయ్యాక మన ఫ్రెండ్స్ కావచ్చు.. వీళ్ళు మనల్ని నమ్మి మనమీద డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు.

*వెల్ విషర్స్*
వీళ్ళు మనకి సహాయం చేయలేకపోవచ్చు, కానీ మనం బాగుండాలని కోరుకుంటారు. మన గురించి శ్రద్ధ తీసుకుంటారు.

ఈ 5 రకాల పత్రాలు పోషించే వాళ్ళు మనకి ఎంతమంది ఉంటె మనం అంత ఎదుగుతాం. *మనం ఎదగడం అంటే, మనం మాత్రమే ఎదగడం కాదు, మనం ఈ 5 పాత్రలలో కొన్నిటిని అయినా, ఎంత ఎక్కువమంది జీవితాల్లో పోషిస్తే అంత ఎదిగినట్లు*.

No comments:

Post a Comment